అన్నవరం:11 మార్చి (హి.స.) సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎన్‌వీ రమణ మంగళవారం అన్నవరం సత్యనారాయణ స్వామివారిని దర్శించుకున్నారు. కుటుంబ సమేతంగా స్వామి దర్శనానికి వచ్చిన ఆయనకు ఆలయ అర్చకులు స్వాగతం పలికారు. స్వామి వారి వ్రతమాచరించి, ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేద పండితులు ఆశీర్వచనం గావించారు. స్వామివారి చిత్రపటం, ప్రసాదాన్ని ఆలయ ఈవో సుబ్బారావు ఆయనకు అందించారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల