వైసీపీ సభ్యుల ఆందోళనతో మళ్లీ వాయిదా పడిన ఏపీ శాసనమండలి
ఏ.పీ, 12 మార్చి (హి.స.) ఏపీ శాసనమండలి మళ్లీ వాయిదా పడింది. వైసీపీ సభ్యుల ఆందోళనను కొనసాగించడంతో సభను చైర్మన్ మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సభ బుధవారం ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు మొదలయ్యాయి.అయితే తమ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని
ఏపీ శాసనమండలిఏపీ శాసనమండలి


ఏ.పీ, 12 మార్చి (హి.స.)

ఏపీ శాసనమండలి మళ్లీ వాయిదా పడింది. వైసీపీ సభ్యుల ఆందోళనను కొనసాగించడంతో సభను చైర్మన్ మరోసారి వాయిదా వేస్తున్నట్లు తెలిపారు. సభ బుధవారం ప్రారంభమైన వెంటనే ప్రశ్నోత్తరాలు మొదలయ్యాయి.అయితే తమ వాయిదా తీర్మానాన్ని ప్రవేశపెట్టాలని

వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. ఫీజు రీఎంబర్స్ మెంట్, నిరుద్యోగ భృతిపై వాయిదా తీర్మానం

ఇచ్చేందుకు ప్రయత్నం చేశారు. అయితే మండలి చైర్మన్ తిరస్కరించారు. దీంతో వైసీపీ ఎమ్మెల్సీలు ఆందోళనకు దిగారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ప్లకార్డులు ప్రదర్శించారు. చైర్మన్ చెప్పినటప్పటికీ తమ వాయిదా తీర్మానాన్ని ప్రవేశ పెట్టాలని డిమాండ్ చేశారు.చైర్మన్ పోడియం వద్దకు వెళ్లి నిరసన వ్యక్తం చేశారు.దీంతో సభలో గందరగోళం నెలకొంది. ఈ మేరకు సభను చైర్మన్ వాయిదా వేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande