హైదరాబాద్, 12 మార్చి (హి.స.)
పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల కేసులో
కీలక పరిణామం చోటుచేసుకుంది. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై ఇవాళ మరోసారి జస్టిస్ బీఆర్ గవాయి, జస్టిస్ వినోద్ చంద్రన్ సుప్రీం ధర్మాసనం విచారణ చేపట్టింది. ఎమ్మెల్యేల అనర్హతపై నిర్ణయం తీసుకోవాలంటూ ఇప్పటికే అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్కు నోటీసులు అందాయి. అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీతో పాటు రాష్ట్ర ప్రభుత్వం, కేంద్ర ఎన్నికల సంఘంతో పాటు, పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా పిటిషన్పై మరోసారి విచారణ చేపట్టిన సుప్రీం కోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. నోటీసులు అందుకున్న వారు ఈ నెల 25 లోగా ఎట్టి పరిస్థితుల్లో కౌంటర్ దాఖలు చేయాలని ధర్మాసనం ఆదేశాలు జారీ చేసింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్