గవర్నర్ ప్రసంగానికి అడ్డు తగిలిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు..
తెలంగాణ, 12 మార్చి (హి.స.) అసెంబ్లీ తొలి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయన ప్రసంగానికి అడ్డు తగిలారు. తొలుత సంపూర్ణ రైతు రుణమాఫీ చేయాలని నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్
తెలంగాణ అసెంబ్లీ


తెలంగాణ, 12 మార్చి (హి.స.)

అసెంబ్లీ తొలి రోజున గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అభ్యంతరం వ్యక్తం చేశారు. అయన ప్రసంగానికి అడ్డు తగిలారు. తొలుత సంపూర్ణ రైతు రుణమాఫీ చేయాలని నినాదాలు చేశారు. గవర్నర్ ప్రసంగిస్తుండగా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు ఆందోళనకు దిగారు. కృష్ణా నీటిలో తెలంగాణ వాటాను తమ ప్రభుత్వం సాధించినట్లుగా గవర్నర్తో కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పించడంపైనా మండిపడ్డారు. ప్రసంగంలో అన్ని అబద్ధాలు ఉన్నాయని ఆరోపించారు. రాష్ట్రంలో రుణమాఫీ, రైతు భరోసా, వరికి రూ.500 బోనస్ ఇవ్వలేదని నినాదాలు చేశారు. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళన మధ్యే గవర్నర్ ప్రసంగాన్ని ముగించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్, జర్నలిస్ట్


 rajesh pande