‌ ‌మన్యం జిల్లా పార్వతీపురం కలెక్టరేట్ వద్ద విజ్ఞాన యాత్ర బస్సు ను ప్రారంభించిన.కలెక్టర్ శ్యాం ప్రసాద్
పార్వతీపురం 11 మార్చి (హి.స.): పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద విజ్ఞాన యాత్రల బస్సును జెండా ఊపి కలెక్టర్ శ్యాం ప్రసాద్ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..విజ్ఞాన యాత్రలతో విద్యార్థులకు క్షేత్రస్థాయి పరిజ్ఞానం పెరుగుతుందని కలెక్టర్ అన్నారు
‌  ‌మన్యం జిల్లా పార్వతీపురం కలెక్టరేట్ వద్ద విజ్ఞాన యాత్ర బస్సు ను ప్రారంభించిన.కలెక్టర్ శ్యాం ప్రసాద్


పార్వతీపురం 11 మార్చి (హి.స.): పార్వతీపురం మన్యం జిల్లా కలెక్టరేట్ వద్ద విజ్ఞాన యాత్రల బస్సును జెండా ఊపి కలెక్టర్ శ్యాం ప్రసాద్ ప్రారంభించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ..విజ్ఞాన యాత్రలతో విద్యార్థులకు క్షేత్రస్థాయి పరిజ్ఞానం పెరుగుతుందని కలెక్టర్ అన్నారు. విద్యార్థులు తరగతి గది పరిజ్ఞానానికే పరిమితం కాకుండా క్షేత్రస్థాయిలోపల అంశాలు నేర్చుకునేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని అందులో భాగంగా విద్యార్థులు విజ్ఞాన యాత్రలకు బయలుదేరుతున్నారని ఆయన పేర్కొన్నారు. విజ్ఞానం పంచే ప్రదేశాలను విద్యార్థులకు చూపించి క్షుణ్ణంగా అర్థమయ్యేలా గైడ్ టీచర్లు వివరించాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా విద్యాశాఖ అధికారి తిరుపతి నాయుడు సమగ్ర శిక్ష ఎపీసీ తేజేశ్వరరావు అధికారులు పాల్గొన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande