విజయవాడ, 14 మార్చి (హి.స.)
హరి హరవీరమల్లు’ కొత్త విడుదల తేదీ వచ్చేసింది. పవన్ అభిమానులతో పాటు సినీ ప్రియులంతా ఎదురుచూస్తున్న ఈ చిత్రం మే 9న రానున్నట్లు నిర్మాణ సంస్థ అధికారికంగా ప్రకటించింది. పవన్ కల్యాణ్ కథానాయకుడిగా రూపొందుతున్న పీరియాడిక్ యాక్షన్ అడ్వెంచర్ మూవీ ‘హరి హర వీరమల్లు’ క్రిష్, జ్యోతికృష్ణ దర్శకత్వంలో ఇది సిద్ధమవుతోంది. రెండు భాగాలుగా ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నారు. తొలి భాగానికి సంబంధించి చిత్రీకరణ ముగింపుదశకు చేరుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే ‘హరిహర వీరమల్లు’ (Hari Hara Veera Mallu Relese Date) రిలీజ్ డేట్‌ను చిత్రబృందం తాజాగా ప్రకటించింది.
మే 9వ తేదీన చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానుంది. . ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటిస్తూ.. ఓ కొత్త పోస్టర్ పంచుకుంది. ఇందులో పవన్, నిధి అగర్వాల్ ఇద్దరూ గుర్రపుస్వారీ చేస్తూ కనిపిస్తున్నారు. ఈ పోస్టర్‌తో టీమ్ ప్రేక్షకులకు హోలీ శుభాకాంక్షలు చెప్పింది. 17వ శతాబ్దం నేపథ్యంలో సాగే ఈ కథలో, పవన్‌కల్యాణ్ చారిత్రాత్మక యోధుడిగా నటిస్తున్నారు. నిధి అగర్వాల్, బాబీ దేవోల్, నర్గీస్ ఫక్రీ, నోరా ఫతేహి కీలక పాత్రలు పోషించారు. క్రిష్ జాగర్లమూడి, జ్యోతికృష్ణ దర్శకులు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ.దయాకర్‌రావు నిర్మిస్తున్నారు. ఎ.ఎం.రత్నం సమర్పకులు. ఎం.ఎం.కీరవాణి స్వరకర్త.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల