మోహన్ లాల్ సినిమాపై సైబర్ దాడి.. ఫిర్యాదు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది
తిరువంతపురం, 31 మార్చి (హి.స.)మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ సినిమా రీసెంట్ గా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రం 2019లో విడుదలైన లూసిఫెర్ కు సీక్వెల్ గా తెరకెక్కించారు. ఎంపురాన్ విడుదలైన త
మోహన్ లాల్ సినిమాపై సైబర్ దాడి.. ఫిర్యాదు చేసిన సుప్రీంకోర్టు న్యాయవాది


తిరువంతపురం, 31 మార్చి (హి.స.)మోహన్ లాల్ నటించిన ఎంపురాన్ సినిమా రీసెంట్ గా విడుదలై మంచి టాక్ సొంతం చేసుకుంది . ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద భారీ కలెక్షన్లు సాధిస్తోంది. ఈ చిత్రం 2019లో విడుదలైన లూసిఫెర్ కు సీక్వెల్ గా తెరకెక్కించారు. ఎంపురాన్ విడుదలైన తర్వాత, సినిమా ఇతివృత్తంపై పలు వివాదాలు తలెత్తాయి. ఈ సినిమా కేంద్ర ప్రభుత్వాన్ని అవమానించేలా ఉందని, అబద్ధాలను వ్యాప్తి చేస్తుందని సంఘ్ పరివార్ ఆరోపించింది. ఈ విషయంపై మోహన్ లాల్ కూడా ఇప్పటికే విచారం వ్యక్తం చేశారు. చాలా మంది మోహన్ లాల్ పై విమర్శలు చేయడం, ట్రోల్స్ చేయడం చేస్తున్నారు. తాజాగా సుప్రీంకోర్టు న్యాయవాది సుభాష్ తీక్కడాన్ సినిమా హీరో మోహన్ లాల్, ఇతరులపై సైబర్ దాడికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేశారు. ఆయన డీజీపీకి ఫిర్యాదు చేశారు. న్యాయవాది ఫిర్యాదుపై వెంటనే చర్యలు తీసుకుంటామని డీజీపీ తెలిపారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande