చెన్నై, 1 ఏప్రిల్ (హి.స.)
దక్షిణాది చిత్రపరిశ్రమలో స్టార్ హీరోగా మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు ధనుష్. నటుడిగా, గాయకుడిగా, నిర్మాతగా, దర్శకుడిగా స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్నాడు.
హిట్టు, ప్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాల్లో నటిస్తున్నాడు. తమిళంతోపాటు తెలుగులోనూ ఈ హీరోకు విపరీతమైన ఫ్యాన్ పాలోయింగ్ ఉంది. అలాగే హిందీలోనూ పలు సినిమాలతో అలరించాడు ధనుష్. తుళ్లువతో ఇలామై సినిమాతో హీరోగా తెరంగేట్రం చేసిన ధనుష్.. ఇప్పటివరకు అనేక హిట్ చిత్రాలతో అడియన్స్ ముందుకు వచ్చాడు. హీరోగానే కాకుండా కంటెంట్ ప్రాధాన్యత ఉన్న విభిన్నమైన సినిమాలను ఎంచుకుంటూ ప్రేక్షకుల హృదయాలను గెలుచుకున్నాడు.
ఇన్నాళ్లు తమిళంలో వరుస సినిమాల్లో నటించిన ధనుష్.. ఇటీవలే సార్ సినిమాతో నేరుగా టాలీవుడ్ ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చారు. ఇటీవలే జాబిలమ్మ నీకు అంత కోపమా సినిమాతో దర్శకుడిగా మరో సక్సెస్ అందుకున్నాడు. తాజాగా మరో సినిమాను రూపొందించేందుకు సిద్ధమైనట్లు టాక్ వినిపిస్తుంది.
జాబిలమ్మా నీకు అంత కోపమా సినిమా తర్వాత ధనుష్, అజిత్ హీరోగా ఓ సినిమాను తెరకెక్కిస్తున్నట్లు వార్తలు వినిపించాయి. అయితే దీని గురించి ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. తాజాగా ధనుష్ కొత్త సినిమా గురించి మరో క్రేజీ న్యూస్ ఫిల్మ్ వర్గాల్లో చక్కర్లు కొడుతుంది. ధనుష్ తెరకెక్కించే కొత్త సినిమాలో హీరోగా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ నటించనున్నట్లు టాక్. ఆర్ఆర్ఆర్ సినిమాతో ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు రామ్ చరణ్. ఇటీవలే గేమ్ ఛేంజర్ సినిమాతో అడియన్స్ ముందుకు వచ్చిన చరణ్.. ప్రస్తుతం పెద్ది చిత్రంలో నటిస్తున్నాడు. డైరెక్టర్ బుచ్చిబాబు సన దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇందులో చరణ్ సరసన జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న సంగతి తెలిసిందే.
ఇక ఇప్పుడు ధనుష్ దర్శకత్వంలో చరణ్ నటించనున్న సినిమాపై క్యూరియాసిటి నెలకొంది. వీరిద్దరి కాంబోలో రాబోయే సినిమా గురించి త్వరలోనే అప్డేట్స్ రానున్నాయట. ప్రస్తుతం ధనుష్ కుబేర, ఇడ్లీ కడై చిత్రాల్లో నటిస్తున్నాడు. అలాగే ‘తేరే ఇషాక్ మైన్’ అనే హిందీ చిత్రంలో నటిస్తున్నారు. ఇందులో కృతి సనన్ ప్రధాన పాత్రలో నటిస్తుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి