హైదరాబాద్, 30 మార్చి (హి.స.) అగ్ర కథానాయకుడు, మెగాస్టార్
చిరంజీవి కొత్త సినిమాను షురూ చేశాడు. ఇటీవలే 'సంక్రాంతికి వస్తున్నాం'తో బ్లాక్బస్టర్ హిట్ అందుకున్న దర్శకుడు అనిల్ రావిపూడితో తన కొత్త ప్రాజెక్ట్ను మొదలుపెట్టాడు.
మెగా157 అనే వర్కింగ్ టైటిల్తో ఈ ప్రాజెక్ట్ రాబోతుండగా.. ఉగాది పండుగ సందర్భంగా ఆదివారం ఉదయం పూజా కార్యక్రమాలతో ఆ చిత్రం
ప్రారంభమైంది. కథనాయకుడు విక్టరీ వెంకటేశ్ క్లాప్ను ఇవ్వగా.. రాఘవేంద్రరావు దర్శకత్వం వహించాడు. ఇక ఈ వేడుకలో నిర్మాతలు అశ్వనీదత్, అల్లు అరవింద్,
దగ్గుబాటి సురేశ్ బాబు, దిల్ రాజు, నాగవంశీ, దర్శకులు వశిష్ఠ, వంశీ పైడిపల్లి, శివ నిర్వాణ, బాబీ, శ్రీకాంత్
ఓదెల, రచయిత విజయేంద్ర ప్రసాద్ తదితరులు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. షైన్ స్క్రీన్స్ పతాకంపై
సాహు గారపాటి, చిరంజీవి కుమార్తె సుస్మిత సంయుక్తంగా ఈ సినిమాను నిర్మింస్తుండగా.. చిరంజీవి ఈ చిత్రంలో తన నిజ పేరైన శంకర్ వరప్రసాద్ పాత్రలో కనిపించనున్నారు. భీమ్స్ సంగీతం అందించబోతున్నాడు.
---------------
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్