విజయవాడ, 18 మార్చి (హి.స.)
కశింకోట: అనకాపల్లి జిల్లా కశింకోట మండలం బయ్యవరంలో దారుణం చోటుచేసుకుంది. ఓ మహిళను దుండగులు హతమార్చారు. అనంతరం శరీర భాగాలను వేరు చేసి బెడ్‌షీట్‌లో చుట్టి జాతీయ రహదారి పక్కన పడేశారు. స్థానికుల సమాచారంలో పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. బెడ్‌షీట్‌లో ఒక చేయి, కాళ్లు ఉన్నట్లు గుర్తించారు. హత్యకు గురైన మహిళ వయసు సుమారు 40 ఏళ్లు ఉంటుందని కశింకోట సీఐ స్వామి నాయుడు తెలిపారు. ఘటనాస్థలంలో ఆధారాలను పరిశీలించి క్లూస్ టీమ్ సాయంతో విచారణ చేపడతామని ఆయన చెప్పారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల