నాగర్ కర్నూల్ జిల్లాలో విషాదం..నీటి కుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి
నాగర్ కర్నూల్, 25 జనవరి (హి.స.) నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు పొలం సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు. ఒక
సెల్ఫీ మోజు


నాగర్ కర్నూల్, 25 జనవరి (హి.స.)

నాగర్ కర్నూల్ జిల్లా ఉరుకొండ మండలం ముచ్చర్లపల్లి గ్రామంలో హృదయవిదారక ఘటన జరిగింది. హైదరాబాద్ నుంచి సొంత గ్రామానికి వచ్చిన ముగ్గురు చిన్నారులు పొలం సమీపంలో ఆడుకుంటుండగా ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి మృతి చెందారు.

ఒక చిన్నారి నీటిలో పడిపోగా కాపాడేందుకు వెళ్లిన మరో ఇద్దరూ మునిగి ప్రాణాలు కోల్పోయినట్లు తెలుస్తోంది. ఈ ఘటనలో ముచ్చర్లపల్లికి చెందిన సిరి (14), శ్రీమన్యు (14)తో పాటు రంగారెడ్డి జిల్లా మహేశ్వరం మండలం రావిర్యాలకు చెందిన స్నేహ (15) మృతి చెందారు.

ఈ దుర్ఘటనతో గ్రామంలో తీవ్ర విషాదం నెలకొంది. చిన్నారుల మృతితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కన్నీరుమున్నీరవుతున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande