
కడప, 05 జూన్ (హి.స.)
కడప జిల్లా ప్రొద్దుటూరులో జరిగిన భారీ నగదు దొంగతనం కేసును టూ టౌన్ పోలీసులు కేవలం 24 గంటల్లోనే ఛేదించారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.11 లక్షల 36 వేల 160 నగదును స్వాధీనం చేసుకున్నారు.ప్రొద్దుటూరు కొర్రపాడు రోడ్డులోని శ్రీనిధి ట్రేడర్స్ మిల్లులో రైతుల నుంచి చెనక్కాయలు కొనుగోలు చేసేందుకు రూ.12 లక్షల 30 వేల నగదును ఉంచారు. ఈ విషయం తెలుసుకున్న మిల్లులో పనిచేస్తున్న కమ్మిగాళ్ల కిరణ్ కుమార్, దేవగుడి ఉత్తయ్యలు దొంగతనానికి పథకం రచించినట్లు పోలీసులు తెలిపారు.
అర్ధరాత్రి సమయంలో మిల్లులోకి ప్రవేశించిన నిందితులు నగదును అపహరించగా, ఫిర్యాదు అందుకున్న వెంటనే పోలీసులు ప్రత్యేక బృందాలతో దర్యాప్తు చేపట్టారు. సాంకేతిక ఆధారాలు, నిఘా సమాచారంతో ఇద్దరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా నేరాన్ని అంగీకరించినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా నిర్వహించిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ విభుకృష్ణ కేసు వివరాలను వెల్లడించారు. సమావేశంలో టూ టౌన్ సీఐ వంశీకృష్ణతో పాటు పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / SANDHYA PRASADA PV