బీజాపూర్ మార్చి 20: మావోయిస్టులకు (Maoist) మరోసారి భారీ ఎదురుదెబ్బ తగిలింది. ఛత్తీస్‌గఢ్ రాష్ట్రంలోని బీజాపూర్ - దంతేవాడ జిల్లా సరహిద్దులో జరిగిన ఎన్‌కౌంటర్‌లో (Encounter) 22 మంది మావోయిస్టులు మృతి చెందారు. బీజాపూర్ - దంతేవాడ జిల్లా సరిహద్దులోని గంగలూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో మావోయిస్టు వ్యతిరేక ఆపరేషన్‌కు జాయింట్ టీమ్ బయలుదేరింది. ఆపరేషన్ సమయంలో భద్రతబలగాలకు మావోయిస్టులు ఎదురుపడ్డారు. దీంతో ఈరోజు (గురువారం) ఉదయం 7 గంటల నుంచి మావోయిస్టులు, భద్రతా దళాల మధ్య నిరంతర కాల్పులు జరిగాయి. ఈ కాల్పుల్లో 22 మంది మావోయిస్టులు మరణించగా.. ఘటనస్థలంలో భారీగా ఆయుధాలు లభ్యమయ్యాయి.
తెలంగాణ సరిహద్దుగా ఉన్న బీజాపూర్ జిల్లాలో పెద్దఎత్తున ఆపరేషన్ కగార్ కొనసాగుతోంది. ముఖ్యంగా మావోయిస్టు కంచుకోటగా ఉన్న బస్తర్ ప్రాంతమే టార్గెట్‌గా ఆపరేషన్ కొనసాగుతోంది. అటు తెలంగాణలో కూడా భారీ హైటెన్షన్ వాతావరణం నెలకొంది. ఛత్తీస్‌గఢ్‌లో భారీగా అణచివేత ఉండటంతో తెలంగాణలో మావోయిస్టులు ప్రవేశించకుండా గ్రౌహౌండ్స్ బలగాలు కూంబింగ్ చేస్తున్నారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు