మెగాస్టార్ కు మరో అరుదైన గౌరవం.. యూకే లోని బ్రిడ్జ్ ఇండియా సంస్థ జీవిత సాఫల్య పురస్కారం
హైదరాబాద్, 20 మార్చి (హి.స.) సినిమాలతో పాటు ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి 'జీవిత సాఫల్య పురస్కారం' ప్రదానం చేసింది బ్రిడ్జ్ ఇండియా సంస్థ. బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీ రూపకల్పనలో కృష
చిరంజీవి


హైదరాబాద్, 20 మార్చి (హి.స.)

సినిమాలతో పాటు ప్రజాసేవ, దాతృత్వానికి చిరంజీవి చేసిన కృషిని గుర్తించి 'జీవిత సాఫల్య పురస్కారం' ప్రదానం చేసింది బ్రిడ్జ్ ఇండియా సంస్థ. బ్రిడ్జ్ ఇండియా సంస్థ అనేది యూకేలో ఒక ప్రముఖ సంస్థ. ఇది పబ్లిక్ పాలసీ రూపకల్పనలో కృషి చేస్తుంది. అలాగే వివిధ రంగాల్లోని వ్యక్తులు సాధించిన విజయాలు..వారు తమ చుట్టూ ఉన్న సమాజంపై చూపించిన ప్రభావం మరింత విస్తృతం కావాలనే ఉద్దేశంతో ఇలా సత్కరిస్తూ ఉంటారు. అయితే బ్రిడ్జ్ ఇండియా సంస్థ లైఫ్ టైమ్ ఆచీవ్మెంట్ అవార్డును తొలిసారిగా చిరంజీవికి అందజేసింది. అందజేస్తోంది. ఇది చిరంజీవి కీర్తి కీరటంలో మరో కలికితురాయిగా నిలుస్తుంది.

ఇక ఇటీవలి కాలంలో చిరంజీవి వరసగా అవార్డులు, గౌరవాలు అందుకుంటూనే ఉన్నారు. గతేడాది దేశ రెండో అత్యున్నత పురస్కార్ పద్మ విభూషణ్ చిరంజీవిని వరించింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande