మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ మధ్య నేడు చెన్నైలో బ్లాక్ బస్టర్ మ్యాచ్..
చెన్నై, 23 మార్చి (హి.స.) చెపాక్ స్టేడియంలో నేటి రాత్రి జరిగే బ్లాక్బస్టర్ మ్యాచ్లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.. మెగా లీగ్ లో తొలి మ్యాచ్లో ఓడే ఆనవాయితీని బ్రేక్ చేయాలని ముంబై పట్టుదలతో ఉండగా.. సొంత మైదానంలో
ఐపీఎల్ మ్యాచ్


చెన్నై, 23 మార్చి (హి.స.)

చెపాక్ స్టేడియంలో నేటి రాత్రి జరిగే బ్లాక్బస్టర్ మ్యాచ్లో మాజీ చాంపియన్లు ముంబై ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ తలపడనున్నాయి.. మెగా లీగ్ లో తొలి మ్యాచ్లో ఓడే ఆనవాయితీని బ్రేక్ చేయాలని ముంబై పట్టుదలతో ఉండగా.. సొంత మైదానంలో ఘన విజయంతో సీజన్ను ఆరంభించాలని చెన్నై భావిస్తోంది. ఈ మ్యాచ్కు ధోనీ ప్రధాన ఆకర్షణ. మరోవైపు హార్దిక్ పాండ్యాపై ఒక మ్యాచ్ బ్యాన్ విధించడంతో తాత్కాలిక కెప్టెన్గా సూర్యకుమార్ యాదవ్ వ్యవహరించ నున్నాడు..

టీ20 ఫార్మాట్లో బ్యాటర్లు, బౌలర్లే కాకుండా.. ఆల్రౌండర్ల పాత్ర అత్యంత కీలకం. ఈ విషయంలో ముంబయితో పోలిస్తే చెన్నై కాస్త బలంగా ఉందనిపిస్తోంది. దాదాపు పదో నంబర్ వరకు బ్యాటింగ్ చేయగల సత్తా సీఎస్కేదే.

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande