చెన్నై, 27 మార్చి (హి.స.)
భారత క్రికెట్ జట్టు మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోని వివిధ రకాల పనులతో బిజీగా ఉంటూనే ఉన్నాడు. అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ తీసుకున్నప్పటికీ ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొంటూనే ఉన్నాడు. గత కొన్ని సంవత్సరాలుగా.. ఐపీఎల్‌లో ఆడుతున్నాడు. ప్రస్తుతం ఐపీఎల్ కొనసాగుతుంది. చెన్నై సూపర్ కింగ్స్ తరపున ఆడుతున్న ధోనీ ఈ ఐపీఎల్ లో ప్రాక్టిస్ తో బిజిబిజిగా గడుపుతున్నాడు.
చెన్నై సూపర్ కింగ్స్ మాజీ కెప్టెన్ , లెజెండరీ వికెట్ కీపర్-బ్యాట్స్ మాన్ ఎంఎస్ ధోని ప్రస్తుతం చెన్నైలో ఉన్నారు. CSK జట్టు తన నెక్స్ట్ మ్యాచ్‌లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరును ఎదుర్కోవలసి ఉంది. అటువంటి పరిస్థితిలో చెన్నై ఆటగాళ్ళు ఈ మ్యాచ్ కోసం సిద్ధం కావడానికి తమ శాయశక్తులా కృషి చేస్తున్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి