ముంబై, 25 మార్చి (హి.స.)
బంగారం ధరలు పెరగడం సాధారణంగా జరిగే విషయమే. అందుకే పెరిగినా మదుపుదారులు, వినియోగదారులు పెద్దగా ఆశ్చర్యపోకుండా కొనుగోలుకు మాత్రం దూరంగా ఉంటున్నారు. బంగారం ధరలు తగ్గితేనే ఆశ్చర్యంగా అనిపించడం ఇప్పడు మామూలయింది. ఎందుకంటే ధరలు పెరగడమే తప్ప తగ్గడం అనేది అరుదుగా జరుగుతుండటమే ఇందుకు కారణం.
గత కొన్ని రోజుల నుంచి ముఖ్యంగా ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం, వెండి ధరలు భారీగా పెరుగుతున్నాయి. ధరలు అందుబాటులో ఉండకుండా దోబూచులాడుతున్నాయి. కొనుగోలు చేయాలనుకున్నా ధరలను చూసి వెనక్కు తగ్గే వారు అనేక మంది కనిపిస్తుండటంతో పాటు బంగారం ధరలు ఇక తగ్గవన్న నిర్ణయానికి వచ్చారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి