యూ.పీ, 31 మార్చి (హి.స.)
మర్చంట్ నేవీ అధికారి సౌరబ్ రాజ్పుత్ హత్య కేసులో నిందితులు ముస్కాన్, సాహిల్ శుక్లాకు చౌదరి చరణ్ సింగ్ జిల్లా జైల్లో నటుడు, బీజేపీ నేత అరుణ్ గోవిల్ రామాయణం పుస్తకాలను అందజేశారు. జైల్లో మొత్తం 1.500 కాపీలను ఖైదీలకు పంపిణీ చేశారు.
“ఘర్ ఘర్ రామాయణం” అనే కార్యక్రమంలో భాగంగా మీరట్ ఎంపీ అరుణ్ గోవిల్ ఈ విధంగా చేశారు. ఈ సందర్భంగా 'జై శ్రీరామ్' నినాదాలతో ఆయనకు స్వాగతం పలికారు.
టెలివిజన్ సిరీస్ 'రామాయణం'లో రాముడి పాత్ర పోషించినందుకు గోవిల్ ప్రసిద్ధి చెందారు. దేశవ్యాప్తంగా 11 లక్షల రామాయణ కాపీలను పంపిణీ చేయాలనే లక్ష్యంతో ఉన్నట్లు తెలిపారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..