దిల్లీ: , 2 ఏప్రిల్ (హి.స.)బీసీ సంక్షేమ సంఘం జాతీయ కమిటీ ఆధ్వర్యంలో దిల్లీ జంతర్‌మంతర్ వేదికగా బీసీ సంఘాల ధర్నా కొనసాగుతోంది. కాంగ్రెస్ సహా అన్ని పార్టీలను బీసీ సంఘాలు ధర్నాకు ఆహ్వానించాయి. ఈ నిరసనలో తెలంగాణ మంత్రులు కొండా సురేఖ, పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు మహేశ్‌కుమార్ గౌడ్, ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్, కాంగ్రెస్ సీనియర్ నేత వీహెచ్, నటుడు సుమన్ తదితరులు పాల్గొన్నారు.
ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ, ఎంపీలు కనిమొళి, సుప్రియా సూలే తదితరులు ఈ ధర్నాకుకు హాజరై సంఘీభావం తెలిపారు. బీసీ రిజర్వేషన్లను 42 శాతానికి పెంచుతూ తెలంగాణ శాసనసభ ఆమోదించిన బిల్లును.. పార్లమెంట్‌లోనూ ఆమోదించి అమలు చేయాలని.. దేశవ్యాప్తంగా జనగణనతో పాటు కులగణన చేయాలని, 33శాతం మహిళా రిజర్వేషన్లలో బీసీ మహిళలకు సబ్‌కోటా కేటాయించాలని నేతలు డిమాండ్ చేశారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు