ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు కూడా’’.. రోడ్‌లపై నమాజ్ ఆపడంతో నిరసన..
మీరట్ , 31 మార్చి (హి.స.)రంజాన్ సందర్భంగా ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయవద్దని ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కోరారు. ముఖ్యంగా మీరట్ ప్రాంతంలో ఎవరైనా రోడ్లపై నమాజ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని, పాస్‌పోర్టు, లెసెన్సులు క్యాన్సల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చ
ముస్లింలు మాత్రమే కాదు, హిందువులు కూడా’’.. రోడ్‌లపై నమాజ్ ఆపడంతో నిరసన..


మీరట్ , 31 మార్చి (హి.స.)రంజాన్ సందర్భంగా ముస్లింలు రోడ్లపై నమాజ్ చేయవద్దని ఇటీవల ఉత్తర్ ప్రదేశ్ పోలీసులు కోరారు. ముఖ్యంగా మీరట్ ప్రాంతంలో ఎవరైనా రోడ్లపై నమాజ్ చేస్తే కేసులు నమోదు చేస్తామని, పాస్‌పోర్టు, లెసెన్సులు క్యాన్సల్ చేస్తామని వార్నింగ్ ఇచ్చారు. ఇదిలా ఉంటే, ఈ రోజు ఈద్ ప్రార్థనల సందర్భంగా మీరట్ రోడ్లపై నమాజ్ చేయడాన్ని అడ్డుకోవడంతో నిరసనకారులు నిరసన చేపట్టారు. ‘‘ముస్లింలు మాత్రమే వీధుల్లో నమాజ్ చేయరు’’ అనే పోస్టర్లను నిరసనకారులు ప్రదర్శించారు.

హోలీ, శివరాత్రి, దీపావళి, గణేష్ చతుర్థి, రామనవమి వంటి పండుగలను హిందువులు కూడా వీధుల్లోనే జరుపుకుంటారని పోస్టర్లలో పేర్కొన్నారు. కన్వార్ యాత్ర కూడా రోడ్లపైనే జరుగుతుందని పోస్టర్లపై రాసి ఉంది. ఇదిలా ఉంటే, యూపీ మొరాదాబాద్‌లో, నమాజ్ చేయడానికి ఈద్గాలోకి ప్రవేశించకుండా ఆపినందుకు కొందరు పోలీసులతో వాగ్వాదానికి దిగారు. లోపల పెద్ద సంఖ్యలో ప్రజలు ఉండటంతో ఈద్గాలోకి ప్రవేశించకుండా అడ్డుకున్నారు. దీని తర్వాత, మళ్లీ నమాజ్ చేవారు. ఈద్-ఉల్-ఫితర్ ఉత్సవాలు ప్రారంభం కావడంతో యూపీలోని సంభాల్‌లో కూడా భద్రతను కట్టుదిట్టం చేశారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నాగరాజ్ రావు


 rajesh pande