కర్నూలు, 31 మార్చి (హి.స.)ఉదయాన్నే గోరువెచ్చని నీరు తాగటం చాలా మందికి అలవాటు. అయితే, ఇందుకు బదులుగా మీరు చియా సీడ్ వాటర్‌తో మొదలుపెట్టి చూడండి. కొద్ది రోజుల్లోనే మీ శరీరంలో ఊహించని మార్పులు గమనిస్తారని పోషకాహార నిపుణులు చెబుతున్నారు. ఇది శరీర సహజ శక్తని పెంచుతుంది. అవసరమైన పోషకాలను అందిస్తుంది. చియా సీడ్స్ షర్బత్ ఒక రుచికరమైన ,రిఫ్రెష్ డ్రింక్, ఇది వేసవిలో చాలా బాగుంటుంది.ఉదయం పూట చియా సీడ్ వాటర్ తాగడం వల్ల కలిగే అద్భుతమైన ఆరోగ్య ప్రయోజనాలేంటో ఇక్కడ తెలుసుకుందాం.
చియా సీడ్స్‌లో యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉంటాయి. ఈ యాంటీ ఆక్సిడెంట్లు చియా విత్తనాలలో ఉండే సున్నితమైన కొవ్వులు, రాన్సిడ్‌లు కాకుండా కాపాడతాయ. అంతేకాదు ఈ యాంటీ ఆక్సిడెంట్లు ఫ్రీ రాడికల్స్ వల్ల కలిగే నష్టం నుంచి శరీరానికి రక్షణ కల్పిస్తాయి.
చియా విత్తనాలలో ఫైబర్ పుష్కలంగా ఉంటుంది. చియా గింజలు నానబెట్టిన నీటిని ఉదయం ఖాళీ కడుపుతో తాగితే.. జీర్ణశక్తి పెరుగుతుంది, పేగు కదలికలను మెరుగుపరుస్తుంది. బరువు తగ్గడానికి ఆరోగ్యకరమైన జీర్ణక్రియ చాలా అవసరం. ఫైబర్ మిమ్మల్ని ఎక్కువసేపు నిండుగా ఉంచుతుంది. మీరు ఎక్కువగా తినకుండా నియంత్రిస్తుంది.
చియా సీడ్స్ లో కాల్షియం, మెగ్నీషియం, పొటాషియం పుష్కలంగా ఉంటాయి. ఇవి బలమైన, ఆరోగ్యకరమైన ఎముకలను నిర్వహించడానికి అవసరం. ఇది బోలు ఎముకల వ్యాధి వంటి పరిస్థితులతో బాధపడుతున్న వ్యక్తులకు సహాయపడుతుంది. చియా సీడ్స్ రక్తంలో చక్కెర స్థాయిల నియంత్రణకు సహాయపడతాయి. ఆహారంలోని కార్పొహైడ్రేట్స్ షుగర్ గా మారడాన్ని నెమ్మది చేస్తుంది. గ్లూకోజ్ స్థాయిలలో ఆకస్మిక హెచ్చుతగ్గులను నివారిస్తాయి. అలాగే ఇన్సులిన్ సున్నితత్వాన్ని మెరుగుపరచడంలో సహాయపడతాయి.
చియా సీడ్స్ లోని ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, యాంటీ ఆక్సిడెంట్లు మీ చర్మా్న్ని హైడ్రేటెడ్ గా ఉంచడానికి సాయపడతాయి. సహజంగానే మీ చర్మం మెరుపును పెంచుతాయి. చియా సీడ్స్ వాటర్ ను పీల్చి ఉబ్బుతాయి. ఇది కడుపు నిండిన అనుభూతిని కలిగిస్తుంది. మీ ఆకలిని నియంత్రిస్తుంది. అధిక కేలరీలు తీసుకోవడాన్ని తగ్గిస్తుంది. దీంతో బరువు తగ్గడానికి సహాయపడుతుంది. చియా గింజలు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ముఖ్యంగా DHA(డోకోసాహెక్సేనోయిక్ యాసిడ్)కి గొప్ప మూలం. ఇవి మెదడు పనితీరుకు కీలకం. జ్ఞాపకశక్తిని మెరుగుపరుస్తాయి.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి