ముంబై, 1 ఏప్రిల్ (హి.స.) దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు ఇవాళ భారీ నష్టాలతో ముగిశాయి. అమెరికా టారిఫ్లు భయాలు మార్కెట్ సెంటిమెంట్ను దెబ్బతీశాయి.
ముఖ్యంగా ఐటీ, బ్యాంకింగ్ షేర్లలో అమ్మకాల ఒత్తిడితో సూచీలు భారీగా నష్టపోయాయి. ఇంట్రాడేలో బాంబే స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ సెన్సెక్స్ ఏకంగా 1400 పాయింట్లకు పైగా క్షీణించగా.. నేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ సూచీ నిఫ్టీ 23,200 మార్క్ దిగువకు చేరింది. మదుపర్ల సంపదగా భావించే బీఎస్ఈలో నమోదిత కంపెనీల మొత్తం విలువ దాదాపు రూ.3.5 లక్షల కోట్లు క్షీణించి రూ.409 లక్షల కోట్లకు పడిపోయింది.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు