పసిడి పరుగు.. దేశంలో ఈరోజు బంగారం ధరలు.
ముంబై, 2 ఏప్రిల్ (హి.స.) మ‌న దేశంలో పెట్టుబ‌డుల‌కు ఎన్నో ఆప్ష‌న్లు ఉన్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువ మంది బంగారం లేదా వెండి వంటి లోహాలు, స్థిరాస్తి రంగాలపై ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగ
GOLD


ముంబై, 2 ఏప్రిల్ (హి.స.)

మ‌న దేశంలో పెట్టుబ‌డుల‌కు ఎన్నో ఆప్ష‌న్లు ఉన్నాయి. అయితే, తెలుగు రాష్ట్రాలైన ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, తెలంగాణ రాష్ట్రాల్లో మాత్రం ఎక్కువ మంది బంగారం లేదా వెండి వంటి లోహాలు, స్థిరాస్తి రంగాలపై ఎక్కువ ఆస‌క్తి చూపుతున్నారు. మరీ ముఖ్యంగా బంగారం అయితే ఎక్కువగా కొంటూ ఉంటారు. అలాగే, ఇటీవలి కాలంలో పసిడి పరుగులు తట్టుకోలేని ప్రజలు వెండిపై ఆసక్తిని చూపుతున్నారు. దీంతో వెండి ధరలు కూడా పై పైకి పాకుతూనే ఉన్నాయి.

ఈ క్రమంలోనే ఏప్రిల్‌ నెల ఆరంభం నుంచే బంగారం ధర సరికొత్త రికార్డును సృష్టిస్తోంది.

బంగారం ధర అంతర్జాతీయ మార్కెట్లో భారీగా పెరుగుతోంది. బంగారం ధర భారీగా పెరగడానికి గల కారణాలు..అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ట్రేడ్ వార్ కారణంగా ఏప్రిల్ 2వ తేదీ నుంచి సరికొత్త టారిఫ్ ప్లాన్లను ప్రకటిస్తానని ముందే చెప్పారు. దీంతో ఆర్థిక మార్కెట్లు అన్నింటిలోనూ భయం నెలకొంది. ఇప్పటికే స్టాక్ మార్కెట్లు సైతం భారీ పతనం దిశగా వెళ్తున్నాయి. ఈ దెబ్బతో బంగారం ధర కొండెక్కి కూర్చుంది.

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.9,285లు ఉండగా, 22 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ.8,511లుగా ఉంది. అలాగే, 18 క్యారెట్ల బంగారం ధర (1 గ్రాము) రూ. 6,964.ల ధర పలుకుతోంది.

– ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.85,260 ఉండగా, 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.93,000 వద్ద ఉంది.

– ప్రస్తుతం కిలో వెండి ధర రూ.1,14,100 వద్ద ఉంది. అయితే కొన్ని రాష్ట్రాల్లో మాత్రం వెండి ధర కాస్త తక్కువగానే ఉన్నట్టుగా తెలుస్తోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande