మళ్లీ పెరిగిన బంగారం ధరలు.. షాక్‌లో పసిడి ప్రియులు..
ముంబై, 13 ఏప్రిల్ (హి.స.) ప్రస్తుతం దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారానిదే హవా నడుస్తోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. త్వరలో గోల్డ్‌ రేట్స్‌ దిగి వస్తాయనే ఆశల్లో ఉన్నవారికి షాకిస్తూ పసిడి పరుగులు తీస్తోంది. గత
GOLD


ముంబై, 13 ఏప్రిల్ (హి.స.) ప్రస్తుతం దేశీయ మార్కెట్‌తో పాటు అంతర్జాతీయ మార్కెట్లోనూ బంగారానిదే హవా నడుస్తోంది. గత కొద్ది రోజులుగా బంగారం ధరలు భగ్గుమంటున్నాయి. త్వరలో గోల్డ్‌ రేట్స్‌ దిగి వస్తాయనే ఆశల్లో ఉన్నవారికి షాకిస్తూ పసిడి పరుగులు తీస్తోంది. గత రెండు, మూడు రోజులుగా పుత్తడి ధరలు పెరుగుతూ వస్తున్నాయి. అలా దాదాపు ఆరు వేలకు చేరువగా పెరిగి షాకిచ్చాయి.

భారతదేశంలో ఈరోజు 24 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ.9,567లు కాగా, 22 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాము రూ. 8,770లుగా ఉంది. అలాగే, 18 క్యారెట్ల బంగారం ధర 1 గ్రాముకు రూ.7,176లు ధర పలుకుతోంది. ఇక దేశంలోని ప్రధాన నగరాలు, పట్టణాల్లో బంగారం,వెండి ధరలు ఇలా ఉన్నాయి..

– చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,670 వద్ద ఉంది.

ముంబైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95, 6700 వద్ద ఉంది.

– ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,850 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,670 వద్ద ఉంది.

– హైదరాబాద్‌లో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.87,700 ఉండగా, అదే 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.95,670 వద్ద ఉంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande