ముంబై, 4 మే (హి.స.)మన దేశ ప్రజలకు బంగారం అంటే ఎంతో ఇష్టం. ముఖ్యంగా మహిళల్లో పసిడిపై మక్కువ ఎక్కువ. బంగారం ఆభరణాలు ధరించేందుకు ఇష్టపడతారు. కొత్త కొత్త డిజైన్లలో బంగారు నగరు ధరించాలని కలలుగంటుంటారు. అందుకోసం ఎప్పటికప్పుడు బంగారం కొంటుంటారు. దీంతో దేశీయంగా పసిడికి ఏడాది పొడవునా గిరాకీ ఉంటుంది. ప్రతి సంవత్సరం మన దేశంలోకి టన్నుల కొద్ది బంగారం దిగుమతి అవుతుంటుంది. అయితే, ఈ ఏడాది ప్రారంభం నుంచి బంగారం ధరలు విపరీతంగా పెరుగుతున్నాయి. ముఖ్యంగా అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకుంటున్న నిర్ణయాలు బంగారం ధరలు భారీగా పెరిగేందుకు కారణమవుతున్నాయి. దీంతో తులం బంగారం ఇటీవలే లక్ష మార్క్ దాటింది. అయితే, ఆ తర్వాత వరుసగా తగ్గుతూ వస్తోంది. క్రితం రోజు వరకు బంగారం ధర భారీగా తగ్గింది. ఇవాళ స్థిరంగా ఉంది. ఈ క్రమంలో మే 4వ తేదీన హైదరాబాద్ మార్కెట్లో బంగారం రేట్లు తెలుసుకుందాం.
---------------
హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి