నేడు స్వల్పంగా దిగి వచ్చిన పసిడి ధర,
ముంబై, 15 ఏప్రిల్ (హి.స.)బంగారం ధరలు రోజురోజుకీ మారుతున్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల మనసులో గందరగోళం నెలకొంటుంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా ఉంటాయి. మన దేశంలో బంగారం, వెండి ధరలు కూడా ప్రపంచంలో ఉన్న బంగార
GOLD


ముంబై, 15 ఏప్రిల్ (హి.స.)బంగారం ధరలు రోజురోజుకీ మారుతున్నాయి. దీంతో పసిడి కొనుగోలుదారుల మనసులో గందరగోళం నెలకొంటుంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ మార్కెట్ కు అనుగుణంగా ఉంటాయి. మన దేశంలో బంగారం, వెండి ధరలు కూడా ప్రపంచంలో ఉన్న బంగారం ధరలపై మాత్రమే కాదు ద్రవ్యోల్బణం, కేంద్ర బ్యాంకు బంగారు నిల్వ, వడ్డీ రేట్లలో ఆధారపడి ఉంటాయి.

- దేశంలోని ప్రధాన నగరాల్లో కూడా బంగారం ధర మంగళవారం కొంత మేర దిగి వచ్చాయి. ఈ నేపధ్యంలో నేటి ధరలు ఎలా ఉన్నాయంటే

- దేశ రాజధాని ఢిల్లీలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 87,690గా ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 95,650లుగా ఉంది.

- దేశ ఆర్ధిక రాజధాని ముంబైలో 10 గ్రాముల బంగారం ధర 22 క్యారెట్ల ధర రూ. 87,540వద్ద ఉంది. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం 95500 వద్ద కొనసాగుతోంది

ఈ రోజు వెండి బంగారం బాటలో నడుస్తూ కొంత మేర దిగి వచ్చింది. హైదరాబాద్ సహా తెలుగు రాష్ట్రాల్లో కేజీ వెండికి వంద రూపాయలు మేర దిగి వచ్చి ఈ రోజు 1,09,800లు గా కొనసాగుతోంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande