ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ :,నేడు పంజాబ్, కోల్కతా మధ్య పోరు
కోల్‌కతా, 15 ఏప్రిల్ (హి.స.) ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో నేటి మ్యాచ్‌ పంజాబ్ కింగ్స్ (PBKS) మరియు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఉత్కంఠగా జరగనుంది.ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది. ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 33 మ్యాచ్‌ల్లో
ఇండియన్ ప్రీమియర్ లీగ్‌


కోల్‌కతా, 15 ఏప్రిల్ (హి.స.)

ఇండియన్ ప్రీమియర్ లీగ్‌ (IPL)లో నేటి మ్యాచ్‌ పంజాబ్ కింగ్స్ (PBKS) మరియు కోల్కతా నైట్ రైడర్స్ (KKR) మధ్య ఉత్కంఠగా జరగనుంది.ఈ మ్యాచ్ రాత్రి 7:30 గంటలకు ప్రారంభమవుతుంది.

ఇప్పటివరకు ఈ రెండు జట్ల మధ్య జరిగిన 33 మ్యాచ్‌ల్లో KKR స్పష్టమైన ఆధిక్యంలో ఉంది. కోల్కతా 21 మ్యాచ్‌లు గెలవగా, పంజాబ్ కేవలం 12 విజయాలతో పరిమితమైంది. అయితే గత నాలుగు సీజన్లలో చెరో నాలుగు విజయాలతో రెండు జట్లు సమంగా నిలిచిన సంగతి విశేషం.

ఈ మ్యాచ్‌కు ముందు పంజాబ్ జట్టుకు ఓ షాక్ తగిలింది. కీలక బౌలర్ లాకీ ఫెర్గూసన్ గాయంతో టోర్నీ నుంచి తప్పుకోవడం జట్టుకు ప్రతికూలంగా మారే అవకాశముంది. అయితే మిడిలార్డర్‌లో ఉన్న మాక్స్వెల్ నుంచి మంచి ఇన్నింగ్స్‌ వచ్చే ఆసలు పంజాబ్ ఆశిస్తోంది. ప్రస్తుతం అతను అద్భుత ఫామ్‌లో ఉన్నాడు. పవర్‌ప్లే తర్వాత వికెట్లు దక్కించే బాధ్యత అతని భుజాలపై ఉంటుంది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande