తగ్గేదేలే.. మళ్లీ పెరిగిన పసిడి ధరలు..ప్రముఖ నగరంలో తులం ఎంత ఉందంటే..
ముంబై, 18 ఏప్రిల్ (హి.స.). అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు, ఇంకా అంతర్జాతీయంగా నెలకొన్న పలు పరిణామాల నేపథ్యంలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో స్వచ్ఛమైన పసిడి ధర 98వేలకు చేరుకుంది. తాజాగా బంగారం ధర పెరగగా.. వెండి ధర
Gold


ముంబై, 18 ఏప్రిల్ (హి.స.). అమెరికా, చైనాల మధ్య సుంకాల పోరు, ఇంకా అంతర్జాతీయంగా నెలకొన్న పలు పరిణామాల నేపథ్యంలో పసిడి ధర రికార్డు స్థాయికి చేరింది. ప్రస్తుతం బులియన్ మార్కెట్‌లో స్వచ్ఛమైన పసిడి ధర 98వేలకు చేరుకుంది. తాజాగా బంగారం ధర పెరగగా.. వెండి ధర స్వల్పంగా తగ్గింది. 18 ఏప్రిల్ 2025 శుక్రవారం ఉదయం ఆరు గంటల వరకు పలు వెబ్‌సైట్లలో నమోదైన ధరల ప్రకారం.. దేశీయంగా 22 క్యారెట్ల బంగారం 10 గ్రాముల ధర రూ.89,210, 24 క్యారెట్ల పది గ్రాముల గోల్డ్ ధర రూ.97,320 గా ఉంది. వెండి కిలో ధర రూ.99,900 లుగా ఉంది. కాగా.. బంగారం పది గ్రాములపై రూ.10 మేర ధర పెరగగా.. వెండి కిలోపై రూ.100 మేర ధర తగ్గింది.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంధ్య ప్రసాద పి.వి


 rajesh pande