అక్రమ అరెస్టులపై ఏబీవీపీ నేతల ఆగ్రహం
హైదరాబాద్, 2 ఏప్రిల్ (హి.స.) విశ్వవిద్యాలయాల భూములను రక్షించాలని కోరుతుంటే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారంటూ ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కుత్బుల్లాపూర్ సర్కిల్ ఐడీపీఎల్ టీ జంక్షన్ లో బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో హైద
ఏబీవీపీ


హైదరాబాద్, 2 ఏప్రిల్ (హి.స.)

విశ్వవిద్యాలయాల భూములను రక్షించాలని కోరుతుంటే అక్రమ కేసులు పెట్టి అరెస్టు చేస్తున్నారంటూ ఏబీవీపీ విద్యార్థి సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు కుత్బుల్లాపూర్ సర్కిల్ ఐడీపీఎల్ టీ జంక్షన్ లో బుధవారం ఏబీవీపీ ఆధ్వర్యంలో హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూములను విశ్వవిద్యాలయానికి ఉంచాలని డిమాండ్ చేస్తూ ధర్నా చేశారు. ప్రభుత్వం అక్రమంగా హెచ్సీయూ భూములను అమ్ముకోవాలని చూస్తుందని, ఈ సందర్భంగా ప్రభుత్వ తీరును దుయ్యబట్టారు. విద్యార్థి సంఘాల ధర్నాతో ఐడీపీఎల్ టీ జంక్షన్ లో ఇరువైపులా భారీగా ట్రాఫిక్ స్తంభించింది. ధర్నా చేస్తున్న విద్యార్థి నాయకులను జీడిమెట్ల పోలీసులు అరెస్ట్ చేసి స్టేషన్కు తరలించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande