తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీకి సిద్ధమైన ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ
తిరుపతి, 3 ఏప్రిల్ (హి.స.) తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీకి ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ సిద్ధమైంది. దీని కోసం రేపు మున్సిపల్ శాఖ అధికారులు.. స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. మాస్టర్ ప్లాన్, రోడ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆ
తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీ


తిరుపతి, 3 ఏప్రిల్ (హి.స.)

తిరుపతిలో టీడీఆర్ బాండ్ల జారీకి

ఆంధ్రప్రదేశ్ మున్సిపల్ శాఖ సిద్ధమైంది.

దీని కోసం రేపు మున్సిపల్ శాఖ అధికారులు.. స్పెషల్ డ్రైవ్ నిర్వహించనున్నారు. మాస్టర్ ప్లాన్, రోడ్ల నిర్మాణంలో భాగంగా స్థలాలు కోల్పోయిన వారికి టీడీఆర్ బాండ్లను త్వరితగతిన జారీ చేసేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

టీడీఆర్ బాండ్ల కోసం ఆన్ లైన్ లో దరఖాస్తు చేయించడం, ఇతర సమస్యలు పరిష్కరించడం కోసం టౌన్ ప్లానింగ్ డైరెక్టర్ విద్యుల్లత స్వయంగా డ్రైవ్ లో పాల్గొననున్నారు.

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande