సీఎం చంద్రబాబు అధ్యక్షతన ముగిసిన మంత్రివర్గ సమావేశం.. పలు కీలక నిర్ణయాలు
ఏ.పీ, అమరావతి, 3 ఏప్రిల్ (హి.స.) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు.. కీలక అంశాలపై చర్చి
సీఎం చంద్రబాబు


ఏ.పీ, అమరావతి, 3 ఏప్రిల్ (హి.స.) ముఖ్యమంత్రి నారా చంద్రబాబు

నాయుడు అధ్యక్షతన నేడు జరిగిన ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గ సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు.. కేబినెట్ సమావేశం తర్వాత మంత్రులతో ప్రత్యేకంగా భేటీ అయిన సీఎం చంద్రబాబు.. కీలక అంశాలపై చర్చించారు.. నెలలో నాలుగు రోజులు మంత్రులు, ఎమ్మెల్యేలు పల్లె నిద్ర చేయాలని, ఈ కార్యక్రమం ద్వారా విధిగా గ్రామాల్లో ఉండి సమస్యలు తెలుసు కోవాలని సూచించారు.. ఇక, ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలు ఇచ్చినా కూడా సరిగ్గా చెప్పలేకపోతున్నాం అని మంత్రులకు చెప్పారు సీఎం చంద్రబాబు..

మన రాష్ట్రంలో లబ్ధిదారుల కన్నా ఇతర రాష్ట్రాల్లో లబ్ధిదారులు చాలా తక్కువ.. అయినా కూడా పథకాలకు సంబంధించి సరిగ్గా చెప్పుకోలేకపోతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు.. మరోవైపు.. మంత్రులు పల్లెల్లో బస చేసే కార్యక్రమానికి పల్లె వెలుగు.. స్వర్ణ గ్రామం అని పేరు పెట్టాలని కేబినెట్లో చర్చించారు..

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande