రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చింది.. మంత్రి నారా లోకేష్
ఏ.పీ, గుంటూరు. 3 ఏప్రిల్ (హి.స.) రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నేడు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉండవల్లిలో తొలి శాశ్వత ఇంట
మంత్రి నారా లోకేష్


ఏ.పీ, గుంటూరు. 3 ఏప్రిల్ (హి.స.)

రాష్ట్రంలో జేసీబీ పాలన పోయి పేదలకు పట్టాలిచ్చే ప్రభుత్వం వచ్చిందని మంత్రి నారా లోకేష్ అన్నారు. మంగళగిరి నియోజకవర్గం ఉండవల్లిలో నేడు మన ఇల్లు మన లోకేష్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా ఉండవల్లిలో తొలి శాశ్వత ఇంటి పట్టాను మంత్రి అందజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. మంగళగిరి నియోజకవర్గంలో పేదల దశాబ్దాల కల నెరవేరింది. పేదలకు పట్టాభిషేకం ప్రారంభమైంది. మొదటి విడత లో శాశ్వత హక్కు కల్పిస్తూ 3 వేల ఇళ్ల పట్టాలు అందిస్తున్నానన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande