తెలంగాణ ఆత్మగౌరవానికి ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
హైదరాబాద్, 2 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ ఆత్మగౌరవానికి ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులో కేటీఆర్ నివాళులర్పించారు. రాజకీయ, సామాజిక సమా
కేటీఆర్


హైదరాబాద్, 2 ఏప్రిల్ (హి.స.) తెలంగాణ ఆత్మగౌరవానికి ధీరత్వానికి ప్రతీక సర్దార్ సర్వాయి పాపన్న గౌడ్ అని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పేర్కొన్నారు. సర్వాయి పాపన్న గౌడ్ వర్ధంతి సందర్భంగా హైదరాబాదులో కేటీఆర్ నివాళులర్పించారు.

రాజకీయ, సామాజిక సమానత్వం కోసం పాపన్న చేసిన కృషి ఎనలేనిది అని కొనియాడారు. సర్వాయి పాపన్న గొప్పతనాన్ని చాటడానికి ప్రతి ఏటా వారి జయంతి, వర్ధంతి కార్యక్రమాలను అధికారికంగా నిర్వహించాలని అప్పటి కేసీఆర్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని కేటీఆర్ గుర్తు చేశారు. ఆ పోరాటయోధుడి వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తున్నాను అని పేర్కొన్నారు. జోహార్ సర్వాయి పాపన్న! అని కేటీఆర్ నినదించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande