శాంతియుతంగా నిరసన చేపట్టిన ప్రొఫెసర్లు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండించిన హరీశ్రావు
హైదరాబాద్, 2 ఏప్రిల్ (హి.స.) హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత నాలుగు రోజుల నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం శాంతియుతంగా నిరసన చేపట్టిన ప్రొఫెసర్లు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్
హరీశ్రావు


హైదరాబాద్, 2 ఏప్రిల్ (హి.స.)

హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో గత నాలుగు రోజుల నుంచి నిరసనలు కొనసాగుతూనే ఉన్నాయి. బుధవారం ఉదయం శాంతియుతంగా నిరసన చేపట్టిన ప్రొఫెసర్లు, విద్యార్థులపై పోలీసులు లాఠీఛార్జ్ చేయడాన్ని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్రావు తీవ్రంగా ఖండించారు.

ఇందిరమ్మ కాలం నాటి ఎమర్జెన్సీని రేవంత్ రెడ్డి సోకాల్డ్ ప్రజాపాలన తలపిస్తుందని హరీశ్రావు ధ్వజమెత్తారు. హెచ్సీయూ విద్యార్థులు, వారికి మద్దతుగా నిలిచిన ప్రొఫెసర్లపై లాఠీ ఛార్జ్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం అని హరీశ్రావు పేర్కొన్నారు.

పచ్చని అడవిని నాశనం చేయొద్దని శాంతియుతంగా నిరసనకు దిగిన విద్యార్థులపై పోలీసుల లాఠీచార్జ్ చేయడం సరికాదన్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్


 rajesh pande