జనగామ జిల్లాలో విషాద ఘటన.. ట్రైన్ కింద పడి ఆత్మహత్య చేసుకున్న ప్రభుత్వ ఉపాధ్యాయుడు
తెలంగాణ, జనగామ. 5 ఏప్రిల్ (హి.స.) జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వల్లాగి కిరణ్ కుమార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు శనివారం ఉదయం సుమారు నాలుగు గంటల ప్
జనగామ జిల్లా న్యూస్


తెలంగాణ, జనగామ. 5 ఏప్రిల్ (హి.స.)

జనగామ జిల్లా స్టేషన్ ఘనపూర్ రైల్వే స్టేషన్లో ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుని బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వల్లాగి కిరణ్ కుమార్ అనే ప్రభుత్వ ఉపాధ్యాయుడు శనివారం ఉదయం సుమారు నాలుగు గంటల ప్రాంతంలో రైల్వే స్టేషన్ సమీపంలో గుర్తుతెలియని ట్రైన్ కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు.

మృతుడు జఫర్గఢ్ మండలం ఉప్పుగల్లు జడ్పీహెచ్ఎస్ పాఠశాలలో స్కూల్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్నాడు. హనుమకొండ జిల్లా నడికుడ మండలం పులిగిల్ల గ్రామానికి చెందిన కిరణ్ కుమార్ తన భార్య విడాకుల ఇవ్వడం వల్లే మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande