రైల్వే.ప్రయాణికులకు ప్రధాండ్ మంత్రి భారతీయ.జన ఔషది దుకాణాలకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు
విజయవాడ, 6 ఏప్రిల్ (హి.స.) అనంతపురం (మూడోరోడ్డు),: రైల్వే ప్రయాణికులకు ప్రధానమంత్రి భారతీయ జనఔషధి దుకాణాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రైలు ప్రయాణం చేసే సమయంలో రైల్వేస్టేషన్లలో ఎక్కడా మందులు దొరకవు. సాధారణ కొట్లలో మందులు విక్రయించరాదని నిబంధన ఉం
రైల్వే.ప్రయాణికులకు ప్రధాండ్ మంత్రి భారతీయ.జన ఔషది దుకాణాలకు  అందుబాటులోకి తీసుకొస్తున్నారు


విజయవాడ, 6 ఏప్రిల్ (హి.స.)

అనంతపురం (మూడోరోడ్డు),: రైల్వే ప్రయాణికులకు ప్రధానమంత్రి భారతీయ జనఔషధి దుకాణాలను అందుబాటులోకి తీసుకొస్తున్నారు. రైలు ప్రయాణం చేసే సమయంలో రైల్వేస్టేషన్లలో ఎక్కడా మందులు దొరకవు. సాధారణ కొట్లలో మందులు విక్రయించరాదని నిబంధన ఉండేది. దీంతో రైలు ప్రయాణం చేసేవారు తమకు అవసరమైన మందులను వెంట తీసుకొని రైలు ఎక్కాల్సిందే. స్టేషన్లలో ఎక్కడైనా కొనుగోలు చేద్దామంటే కుదరదు. ఇంటి వద్ద బయలుదేరే ముందు ప్రయాణికులు ఏవైనా సాధారణ మందులు తీసుకోకుండా వెళితే ఇబ్బందులు పడాల్సిందే. బీపీ, షుగర్, గ్యాస్‌ట్రబుల్, జ్వరం, జలుబు లాంటి జబ్బులకు మందులు ఎక్కడా దొరకని పరిస్థితి. అయితే ప్రస్తుతం ఏ ప్లస్, ఏ కేటగిరీ రైల్వేస్టేషన్లలో ‘ప్రధానమంత్రి భారతీయ జనఔషధి’ దుకాణాలను ఏర్పాటు చేస్తున్నారు. దేశవ్యాప్తంగా ఒకే కొలతలతో వీటిని ఏర్పాటు చేయాలని ఆదేశాలు జారీ అయ్యాయి. వీటి నిర్మాణాలను గుత్తేదారులకు అప్పగించారు. అనంతపురం రైల్వేస్టేషన్‌లో ఇప్పటికే జన ఔషధి దుకాణ నిర్మాణం పూర్తి అయింది. రైల్వే అధికారులు ఇప్పటికే పరిశీలించారు. త్వరలోనే దుకాణాన్ని ప్రయాణికులకు అంకితం చేయనున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande