స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి..
తెలంగాణ, స్టేషన్గన్పూర్. 9 ఏప్రిల్ (హి.స.) స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక బస్టాండ్ వద్ద కంగన్ హాల్ ప్రారంభోత్సవానికి కడియం శ్రీహరి విచ్చేశారు. కంగన్ హాల్ ప్రారంభిస్తుండగా పటాకులు కాల్చడంతో మిరుగులు
కడియం  శ్రీహరి


తెలంగాణ, స్టేషన్గన్పూర్. 9 ఏప్రిల్ (హి.స.)

స్టేషన్ ఘన్పూర్ ఎమ్మెల్యే కడియం శ్రీహరి పర్యటనలో అపశృతి చోటు చేసుకుంది. స్థానిక బస్టాండ్ వద్ద కంగన్ హాల్ ప్రారంభోత్సవానికి కడియం శ్రీహరి విచ్చేశారు. కంగన్ హాల్ ప్రారంభిస్తుండగా పటాకులు కాల్చడంతో మిరుగులు టెంట్ పై పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు, పోలీసులు వెంటనే మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఈ ఘటనలో ఎవరికి ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande