తెలంగాణ, నిజామాబాద్, 17 ఏప్రిల్ (హి.స.)
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ శాఖలలో పనిచేసి పదవీ విరమణ పొందిన సీనియర్ సిటిజన్స్ అందరు వారి అనుభవాన్ని సమాజ శ్రేయస్సుకు ఉపయోగించాలని నిజామాబాద్ అర్బన్ ధన్ పాల్ సూర్యనారాయణ గుప్త అన్నారు. నిజామాబాద్ నగరంలోని సుభాష్ నగర్ లో తెలంగాణ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ వారి నూతన భవనం ప్రారంభోత్సవానికి ముఖ్యఅతిథిగా అర్బన్ ఎమ్మెల్యే ధన్ పాల్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్ ఉద్యోగుల బెనిఫిట్స్ ఇతర సమస్యలను అసెంబ్లీలో ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని, విశ్రాంత ఉద్యోగుల ఆరోగ్య సంక్షేమం కొరకు యోగా కేంద్రం, లైబ్రరీ ఏర్పాటుకు ప్రభుత్వ నిధులు సమకూర్చేలా కృషి చేస్తానని ధన్ పాల్ మాట ఇచ్చారు.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు