విజయవాడ, 19 ఏప్రిల్ (హి.స.)దేశ వ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఉత్కంఠతో ఎదురుచూస్తోన్న జేఈఈ (మెయిన్) సెషన్ -2 ఫలితాలు వచ్చేశాయి. శుక్రవారం మధ్యాహ్నం ఫైనల్ కీ విడుదల చేసిన ఎన్‌టీఏ(NTA) అధికారులు.. తాజాగా విద్యార్థులు సాధించిన పర్సంటైల్ స్కోరుతో ఫలితాలను విడుదల చేశారు. దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీలు, ట్రిపుల్ ఐటీల్లో బీఈ/బీటెక్ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఏప్రిల్ 2, 3, 4, 7, 8 తేదీల్లో పేపర్ -1 పరీక్షలు జరిగిన విషయం తెలిసిందే. స్కోర్ కార్డు డౌన్‌లోడ్ చేసుకొనేందుకు విద్యార్థులు తమ అప్లికేషన్ నంబర్, పాస్‌వర్డ్‌తో పాటు క్యాప్చా కోడ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది.
---------------
హిందూస్తాన్ సమచార్ / నిత్తల