.సికింద్రాబాదు స్టేషన్ పునరాభివృద్ధిలో.భాగంగా అనేక రైళ్ళను చర్లపల్లి కాచిగూడ నాంపల్లి కి.మళ్ళించారు
హైదరాబాద్‌ , 19 ఏప్రిల్ (హి.స.) : సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధిలో భాగంగా అనేక రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి మళ్లించారు. ఏ రైలును ఎటు మళ్లించారో తెలియక ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంటోంది. చర్లపల్లికి చేరుకునేందుకు ఆపసోపాలు పడాల్సి వస
.సికింద్రాబాదు స్టేషన్ పునరాభివృద్ధిలో.భాగంగా అనేక రైళ్ళను చర్లపల్లి  కాచిగూడ నాంపల్లి కి.మళ్ళించారు


హైదరాబాద్‌ , 19 ఏప్రిల్ (హి.స.)

: సికింద్రాబాద్‌ స్టేషన్‌ పునరాభివృద్ధిలో భాగంగా అనేక రైళ్లను చర్లపల్లి, కాచిగూడ, నాంపల్లికి మళ్లించారు. ఏ రైలును ఎటు మళ్లించారో తెలియక ప్రయాణికుల్లో గందరగోళం నెలకొంటోంది. చర్లపల్లికి చేరుకునేందుకు ఆపసోపాలు పడాల్సి వస్తోంది. కొన్ని ఎంఎంటీఎస్‌లు, ఆర్టీసీ బస్సులు నడుస్తుండడంతో సమయానికి చేరుకునే పరిస్థితి. రాత్రివేళ చర్లపల్లి నుంచి ఇళ్లకు చేరుకునేందుకూ ఇబ్బందులే.

ఉప్పల్‌కు చెందిన సంతోష్‌..తిరుపతి వెళ్లేందుకు టిక్కెట్లు బుక్‌ చేస్తున్న క్రమంలో రైలును చర్లపల్లికి మళ్లించారని తెలిసింది. దీంతో ఉప్పల్‌ నుంచి హబ్సిగూడకు వచ్చి అక్కడి నుంచి చర్లపల్లికి వెళ్దామంటే ఒక్క బస్సూ రాలేదు. చేసేది లేక క్యాబ్‌ బుక్‌ చేయగా పలుమార్లు రద్దయింది. ఆటోవాలా రూ.600 డిమాండ్‌ చేశాడు. సమయం మించిపోతుండటంతో చేసేది లేక అడిగిన మొత్తం ఇచ్చి చర్లపల్లి చేరుకున్నాడు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande