భారత అంతరిక్ష సంస్థ మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది
సూళ్లూరుపేట, 19 ఏప్రిల్ (హి.స.), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి మే 22న జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రాకెట్‌
భారత అంతరిక్ష సంస్థ మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది


సూళ్లూరుపేట, 19 ఏప్రిల్ (హి.స.), భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) మరో ప్రయోగానికి సన్నద్ధమవుతోంది. తిరుపతి జిల్లా శ్రీహరికోటలోని సతీశ్‌ ధవన్‌ అంతరిక్ష కేంద్రం షార్‌ నుంచి మే 22న జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 రాకెట్‌ ప్రయోగానికి సన్నాహాలు చేస్తోంది. ఈ రాకెట్‌ ద్వారా అమెరికాకు చెందిన నిషార్‌ ఉపగ్రహాన్ని రోదసిలోకి పంపనుంది. ఇప్పటికే షార్‌లో రెండో ప్రయోగ వేదిక వద్దనున్న వెహికల్‌ అసెంబ్లీ బిల్డింగ్‌ (వ్యాబ్‌లో)లో రాకెట్‌ అనుసంధాన పనులు వేగంగా సాగుతున్నాయి. దీంతో పాటు పీఎస్ఎల్వీ-సీ61, ఎల్‌వీఎం-3-జీ1, ఎల్‌వీఎం3-ఎం5 రాకెట్ల అనుసంధాన పనులు కూడా జరుగుతున్నాయి. జీఎస్ఎల్వీ-ఎఫ్‌16 అనుసంధానానికి సంబంధించిన రాకెట్‌ పరికరాలు కేరళలోని తిరువనంతపురం నుంచి భారీ భద్రత నడుమ రోడ్డు మార్గాన రెండు ప్రత్యేక వాహనాల్లో శుక్రవారం షార్‌కు తీసుకొచ్చారు. ప్రయోగించే విదేశీ ఉపగ్రహాన్ని కూడా నెలాఖరులో షార్‌కు తీసుకురానున్నారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande