తెలంగాణ, ఆదిలాబాద్. 19 ఏప్రిల్ (హి.స.) ఆదిలాబాద్ జిల్లాలో భూ
భారతి చట్టంపై అవగాహన కార్యక్రమంలో మంత్రి సీతక్క పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ధరణితో దందాలు చేశారు.. అలాంటి వాటికి ఇప్పుడు భూభారతిలో చోటు లేదన్నారు. గత పదేళ్లుగా ఆక్రమించిన భూ భాగోతం మొత్తం బయటకొస్తుందనే భయం వారికి పట్టుకుంది.. ఇంట్లో కూర్చోని ధరణి తయారు చేశారు.. విచ్చల విడిగా దొంగ వార్తలు ప్రచురిస్తున్నారు.. భూ భారతిలో వాళ్ల ఆగడాలు బయటకు వస్తాయనే అనవసరమైన ఆరోపణలు చేస్తున్నారు.. తప్పుడు వార్తలకు ప్రయార్టీ ఇస్తున్నారు.. ప్రజలు ఆలోచించాలి అని సూచించారు. వాళ్ల లాగా దొంగ మాటలు చెప్పి అధికారంలోకి రాలేదు.. మాది ప్రజల ప్రభుత్వం.. ధరణికి భూ భారతికి చాలా తేడా ఉందని మంత్రి సీతక్క వెల్లడించింది.
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు