రాహుల్ గాంధీది క్షమించే గుణం.. మోడీ, అమిత్ షా లది కుట్రగుణం.. టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి
తెలంగాణ, 17 ఏప్రిల్ (హి.స.) దేశ స్వాతంత్ర ఉద్యమంలో రాహుల్ గాంధీ పూర్వికులు ఎనలేని ఉద్యమాలు చేశారని, ఇప్పటికీ రాహుల్ గాంధీ అదే బాటలో నడుస్తూ క్షమించే గుణాన్ని అలవర్చుకున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి ప
జగ్గారెడ్డి


తెలంగాణ, 17 ఏప్రిల్ (హి.స.)

దేశ స్వాతంత్ర ఉద్యమంలో

రాహుల్ గాంధీ పూర్వికులు ఎనలేని ఉద్యమాలు చేశారని, ఇప్పటికీ రాహుల్ గాంధీ అదే బాటలో నడుస్తూ క్షమించే గుణాన్ని అలవర్చుకున్నారని టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి అన్నారు. గురువారం సంగారెడ్డి పట్టణంలోని పాత పోస్ట్ ఆఫీస్ ఎదురుగా నేషనల్ హెరాల్డ్ కేసులో సోనియా, రాహుల్ గాంధీ పేర్లను ఈడీ చార్జి షీటులో చేర్చడాన్ని వ్యతిరేకిస్తూ ఆయన ధర్నా కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా జగ్గారెడ్డి మాట్లాడుతూ రాహుల్ గాంధీకి ఉన్న క్షమించే గుణం ఎవరికీ లేదని, మోడీ, అమిత్ షా లది కుట్ర గుణమని మండిపడ్డారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande