యాసంగి పంట రైతులకు రూ. 500 బోనస్ తో చివరి గింజ వరకు కొనుగోలు చేస్తాo.. నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి.
తెలంగాణ, నారాయణపేట. 9 ఏప్రిల్ (హి.స.) యాసంగి పంటలకు సంబంధించి రైతులకు రూ. 500 బోనస్ తో చివరి గింజ వరకు వడ్లు కొనుగోలు చేస్తామని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి అన్నారు. బుధవారం మరికల్ మండలంలోని తీలేరు సింగిల్ విండో కార్యాలయం వద్ద ధాన్యం
ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి.


తెలంగాణ, నారాయణపేట. 9 ఏప్రిల్ (హి.స.) యాసంగి పంటలకు సంబంధించి రైతులకు రూ. 500 బోనస్ తో చివరి గింజ వరకు వడ్లు కొనుగోలు చేస్తామని నారాయణపేట ఎమ్మెల్యే చిట్టెం పరిణికా రెడ్డి అన్నారు. బుధవారం మరికల్ మండలంలోని తీలేరు సింగిల్ విండో కార్యాలయం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఆమె ప్రారంభించారు.

ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఏ గ్రేడ్ ధాన్యానికి రూ. 2,320, బి గ్రేడ్ ధాన్యానికి రూ. 2,300తో పాటు రూ. 500 బోనస్తో చెల్లించి వడ్లు కొనుగోలు చేస్తామని అన్నారు. రైతులకు ఇబ్బందులు కలగకుండా ముందస్తుగా కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశామని వివరించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande