తెలంగాణ, నల్గొండ. 9 ఏప్రిల్ (హి.స.)
నల్లగొండ జిల్లా చిట్యాల మండలం
ఉరుమడ్ల గ్రామంలో 1 కోటి 18 లక్షల రూపాయలతో చేపట్టిన ఊర చెరువు మరమ్మతు పనులను శాసన మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్రెడ్డి బుధవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. చెరువు మరమ్మతు కారణంగా చెరువులో నీటి నిల్వ సామర్థ్యం పెరుగుతుందన్నారు. తద్వారా పరిసర ప్రాంతాల్లో భూగర్భ జలాలు పెరుగుతాయన్నారు. ఇది గ్రామంలో పంట పొలాలకు ఎంతో ఉపయోగకరంగా మారుతుందని తెలిపారు.
---------------
హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు