సవాళ్లు ప్రతి సవాళ్లతో హీటెక్కిన స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు
తెలంగాణ, స్టేషన్గన్పూర్. 9 ఏప్రిల్ (హి.స.) ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ ఎమ్మెల్యే టి. రాజయ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో కడియం భూకబ్జా వార్తలపై ఎమ్మెల్యే కడియం శ
స్టేషన్ ఘన్పూర్ రాజకీయాలు


తెలంగాణ, స్టేషన్గన్పూర్. 9 ఏప్రిల్ (హి.స.)

ఎమ్మెల్యే కడియం శ్రీహరి, మాజీ

ఎమ్మెల్యే టి. రాజయ్య సవాళ్లు ప్రతి సవాళ్లతో స్టేషన్ ఘన్పూర్ నియోజకవర్గ రాజకీయాలు హీటెక్కాయి. తాజాగా ధర్మసాగర్ మండలం దేవునూర్ గ్రామంలో కడియం భూకబ్జా వార్తలపై ఎమ్మెల్యే కడియం శ్రీహరి విసిరిన సవాల్కు మాజీ ఎమ్మెల్యే రాజయ్య సై అన్నారు. బుధవారం స్టేషన్ ఘనపూర్ బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో మీడియాతో రాజయ్య మాట్లాడారు. హనుమకొండ జిల్లా ధర్మసాగర్ మండలం ముప్పారం, దేవునూరు గ్రామాలలో కడియం శ్రీహరి భూకబ్జా చేశాడంటూ వచ్చిన వార్తలపై కడియం శ్రీహరి స్పందించారు.

తనపై ఆరోపణలను నిరూపిస్తే ఎమ్మెల్యే పదవికి రాజీనామ చేసి ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి, రాజయ్యల వద్ద గులాంగిరీ చేస్తానని, లేనియెడల వారు తన వద్ద చేయాలంటూ సవాల్ విసిరారు. ఈ సవాల్కు స్పందించిన మాజీ ఎమ్మెల్యే రాజయ్య కడియం సవాలును స్వీకరిస్తున్నానని, టైం, డేటు, లొకేషన్ కడియమే నిర్ణయించాలన్నారు. ఫారెస్ట్ భూములలో ఉపాధి హామీలో పెట్టిన కోట్ల విలువైన చెట్లను తొలగించడమే కాకుండా మైనింగ్ అనుమతి లేకుండా మొరం తరలించారని రాజయ్య ఆరోపించారు.

హిందూస్తాన్ సమచార్ / విడియాల వెంకటేశ్వర్ రావు


 rajesh pande