ఏ.పీ, అమరావతి, 6 ఏప్రిల్ (హి.స.)
రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రాష్ట్రాన్ని దోచుకుంటున్నారని కేంద్రమంత్రి జీ కిషన్ రెడ్డి ఆరోపించారు. బడంగ్పేట్ మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో ఏర్పాటుచేసిన బీజేపీ ఆవిర్భావ దినోత్సవ కార్యక్రమానికి కిషన్ రెడ్డి, ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి, హాజరయ్యారు. ఈ సందర్భంగా బీజేపీ జెండాను కేంద్ర మంత్రి ఆవిష్కరించారు.
రాష్ట్రంలో అవినీతి అక్రమాలు పెరిగిపోయాయని కిషన్ రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. దరిద్రమైన పాలన కొనసాగుతుందన్నారు.రియల్ ఎస్టేట్ రంగం పూర్తిగా దెబ్బ తిన్నదన్నారు. కాంగ్రెస్ పాలన ఎలా ఉందో బిల్డర్లను అడిగితే తెలుస్తుందన్నారు. . కాంగ్రెస్ పాలనను చూసి ప్రజలు అసహ్యించుకుంటున్నారని పేర్కొన్నారు. కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందన్నారు.
హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..