‌రాజధాను గ్రామం అనంతవరం. కొండ వెనుక.రాజధాని. భూముల్లో. అక్రమ మట్టి. తవ్వకాలు జరుగుతున్నాయి
విజయవాడ, 6 ఏప్రిల్ (హి.స.) గుంటూరు, : రాజధాని గ్రామం అనంతవరం కొండ వెనుక రాజధాని భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వడ్డమాను గ్రామానికి చెందిన వ్యక్తులు కొండ వెనుక అనుమతులు లేకుండా జేసీబీలతో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించి అమ్మి సొమ
‌రాజధాను గ్రామం అనంతవరం. కొండ వెనుక.రాజధాని. భూముల్లో. అక్రమ మట్టి. తవ్వకాలు జరుగుతున్నాయి


విజయవాడ, 6 ఏప్రిల్ (హి.స.)

గుంటూరు, : రాజధాని గ్రామం అనంతవరం కొండ వెనుక రాజధాని భూముల్లో అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతున్నాయి. వడ్డమాను గ్రామానికి చెందిన వ్యక్తులు కొండ వెనుక అనుమతులు లేకుండా జేసీబీలతో మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా తరలించి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. రెండు రోజుల క్రితం వడ్డమాను సమీపంలో అక్రమంగా మట్టి తరలిస్తున్న ట్రాక్టర్లను స్థానికులు అడ్డుకున్నారు. దానికి సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల ద్వారా బయటకు వచ్చాయి. అదేవిధంగా కొద్ది రోజుల క్రితం నెక్కల్లు సమీపంలో ఒక లారీ, పొక్లెయిన్‌ను స్వాధీనం చేసుకున్న పోలీసులు వాటిని వదిలేశారని విమర్శలు వస్తున్నాయి. రైతులకు కేటాయించిన ప్లాట్లలో మట్టి తవ్వి గోతులు చేస్తున్నా సీఆర్డీఏ అధికారులు, పోలీసులు పట్టించుకోవటం లేదని స్థానికులు చెబుతున్నారు. అనంతవరం, వడ్డమాను గ్రామాల మధ్య ఉన్న కొండ కూడా సీఆర్డీఏ ఆధీనంలో ఉంది. అక్కడ గ్రావెల్‌ను తవ్వాలన్నా, రాజధాని భూముల్లో మట్టిని తరలించాలన్నా తప్పని సరిగా సీఆర్డీఏ, మైనింగ్‌ శాఖల నుంచి అనుమతి తీసుకోవాల్సి ఉంటుంది. అవేవీ లేకుండా అక్రమార్కులు ఇష్టానుసారం రాజధాని భూముల్లో యంత్రాలతో తవ్వి మట్టి తరలించుకు పోతున్నారు. కూటమి ప్రభుత్వంలోనూ దీనికి అడ్డుకట్ట పడటం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని తుళ్లూరు సీఆర్డీఏ స్పెషల్‌ డిప్యూటీ కలెక్టర్‌ పి. పద్మావతి.. తుళ్లూరు స్టేషన్‌ ఎస్‌హెచ్‌ఓ, తహసీల్దార్‌కు ఇటీవల లేఖ రాశారు. తుళ్లూరులో పనిచేస్తున్న ఒక పోలీసు అధికారి అక్రమార్కులకు తెరవెనుక నుంచి సహకరిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.

---------------

హిందూస్తాన్ సమచార్ / నిత్తల


 rajesh pande