హైదరాబాద్, 2 ఏప్రిల్ (హి.స.) బీఆర్ఎస్ అధినేత, మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఇవాళ ఉమ్మడి మెదక్ జిల్లాకు చెందిన పార్టీ ముఖ్య నేతలతో ఎర్రవెల్లి ఫామ్ హౌస్ లో కీలక భేటీ నిర్వహించారు. ఈ సమావేశానికి మెదక్, సంగారెడ్డి, సిద్ధిపేట జిల్లాల నుంచి పలువురు మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నేతలు హాజరయ్యారు.
ఈ సమావేశంలో బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన పలు కీలక అంశాలు చర్చకు వచ్చాయి. ముఖ్యంగా, ఈ నెల 27 న వరంగల్లో జరగనున్న పార్టీ సిల్వర్ జూబ్లీ మహాసభను విజయవంతం చేయడానికి తీసుకోవాల్సిన చర్యలపై కేసీఆర్ నేతలకు స్పష్టమైన దిశానిర్దేశం చేశారు. బీఆర్ఎస్ తన రాజకీయ ప్రస్థానంలో 25 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా, ఈ సభను ఎంతో ప్రతిష్టాత్మకంగా నిర్వహించాలని నిర్ణయించారు.
హిందూస్తాన్ సమచార్ / బచ్చు రంజిత్ కుమార్