బీజేపీ, ఆర్ఎస్సెస్ తమ రాజకీయ లబ్ది కోసం అశాంతిని రెచ్చగొడుతున్నాయి.. మమతా బెనర్జీ
కోల్కత్తా, 20 ఏప్రిల్ (హి.స.) పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆర్ఎస్సెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇటీవలి హింస, విధ్వంసక చర్యలకు సంబంధించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 'బెంగాల్లో బీజేపీ, దాని మిత్రప
మమతా బెనర్జీ


కోల్కత్తా, 20 ఏప్రిల్ (హి.స.)

పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ఆర్ఎస్సెస్, బీజేపీపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. రాష్ట్రంలో ఇటీవలి హింస, విధ్వంసక చర్యలకు సంబంధించి అసత్యాలు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. 'బెంగాల్లో బీజేపీ, దాని మిత్రపక్షాలు దౌర్జన్యాలకు దిగాయి. వారి మిత్రపక్షాల్లో ఆర్ఎస్సెస్ కూడా ఉంది. ఇది వరకు ఆర్స్సెస్ పేరు ప్రస్తావించలేదు, కానీ ఇప్పుడు తప్పట్లేదు. వారంతా కలిసి రాష్ట్రంలో ఒక దుర్మార్గపు తప్పుడు ప్రచారానికి శ్రీకారం చుట్టారు. బాధాకరమైన అంశాన్ని వారి దుష్ట రాజకీయాలకు ఉపయోగించుకుంటున్నాయి. ఇదొక బ్యాడ్ గేమ్' అని మమతా విమర్శించారు. బీజేపీ, ఆర్ఎస్సెస్ తమ రాజకీయ లబ్ది కోసం అశాంతిని రెచ్చగొడుతున్నాయని ఆరోపించారు.

---------------

హిందూస్తాన్ సమచార్ / సంపత్ రావు, జర్నలిస్ట్..


 rajesh pande